క్యారెట్‌తో వడియాలు

కావల్సినవి: క్యారెట్‌- అరకేజీ, సగ్గుబియ్యం- నాలుగుకప్పులు, గసగసాలు- రెండుచెంచాలు, జీలకర్ర- చెంచా, పచ్చిమిర్చి- పది, ఉప్పు- సరిపడా. తయారుచేసే విధానం: సగ్గుబియ్యాన్ని రెండుగంటల ముందు నానబెట్టుకోవాలి. తరవాత అందులో పదిహేను గ్లాసుల నీళ్లు పోసి పొయ్యిమీద పెట్టాలి. అలానే క్యారెట్లను శుభ్రం చేసి చెక్కు తీసి కోరాలి. సగ్గుబియ్యం సగం ఉడికాక క్యారెట్‌ తురుము వేయాలి. అలాగే కొత్తిమీర, గసగసాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉప్పు మిక్సీలో ముద్దలా చేసుకుని ఉడుకుతున్న పిండిలో వేసి కలిసి రెండునిమిషా లయ్యాక దింపేయాలి. గరిటెతో వడియాల్లా పెట్టుకుంటే చాలు.

Read more