బీట్‌రూట్‌ ప‌చ్చ‌డి – beetroot pickle

కావల్సినవి: బీట్‌రూట్‌- ఒకటి, ఉప్పు- తగినంత, కారం- అరకప్పు, ఆవపిండి- పావుకప్పు, నిమ్మరసం- ఆరుచెంచాలు, పసుపూ, నూనె- కప్పు, ఆవాలు- అరచెంచా, ఎండుమిర్చి- రెండు. తయారీ: బీట్‌రూట్‌ని చిన్నముక్కలుగా తరిగి అందులో నిమ్మరసం కలిపి పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి ఆవాలూ, ఎండుమిర్చీ వేయించి పొయ్యి కట్టేయాలి. అందులోనే తగినంత ఉప్పూ, కారం, ఆవపిండీ వేసి నిమిషం అయ్యాక ఈ తాలింపునంతా బీట్‌రూట్‌ ముక్కలకు కలిపితే చాలు.

Read more

బీట్‌రూట్ కూర

కావలసిన పదార్థాలు : బీట్‌రూట్‌ : పావు కేజీ పెసరపప్పు : రెండు స్పూన్లు పచ్చికొబ్బరి : ఒక చిప్ప పచ్చిమిర్చి : ఏడు ఉప్పు : సరిపడ పసుపు: కొద్దిగ పోపు గింజలు : రెండు స్పూన్లు నూనె : ఐదు స్పూన్లు తయారు చేసే విధానం: 1) పెసర పప్పు నానబెట్టాలి. 2) బీట్‌రూట్‌ పై చెక్కు తీసి నీటిలో బాగా కడిగి తురుముకోవాలి. 3) కొబ్బరి కూడా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. 4) స్టౌ మీద బాణలి పెట్టి నూనె […]

Read more