ఎగ్‌ డ్రాప్‌ సూప్‌ – Egg drop soup

కావల్సిన పదార్థాలు: వెజిటబుల్‌ స్టాక్‌ 3కప్పులు, కోడిగుడ్లు రెండు, పచ్చిబఠానీలు పావుకప్పు, పుట్టగొడుగులు కొన్నిముక్కలు,ఉప్పు అరచెంచా, సోయాసాస్‌ ఒక చెంచా. తయారుచేయు విధానం: వెజిటబుల్‌ స్టాక్‌ను వేడి చేసి అందులో పుట్టగొడుగుల ముక్కలు, బఠానీలు వేయాలి. ముక్కలు మెత్తబడిన తర్వాత సోయాసాస్‌, ఉప్పు వేయాలి. కొంచెం మరుగుతుండగా గిలకొట్టిన కోడిగుడ్డును కొద్దికొద్దిగా వేస్తూ బాగా కలపాలి. తక్కువ మంట మీద పావుగంట సేపు ఉడికించాలి.

Read more