ఫ్రైడ్‌ చికెన్‌ -Fried Chicken

కావలసినవి:
బోన్‌లెస్‌ చికెన్‌: పావుకిలో, అల్లం ముద్ద: 2 టీస్పూన్లు, వెల్లుల్లిముద్ద: టీస్పూను, పచ్చిమిర్చి ముద్ద: టీస్పూను, మైదా: 4 టీస్పూన్లు, కాశ్మీరీ కారం: టీస్పూను, దనియాలపొడి: టీస్పూను, చాట్‌మసాలా: అరటీస్పూను, నిమ్మరసం: 2 టీస్పూన్లు, ఉల్లిపాయ: ఒకటి, ఎరుపు రంగు: చిటికెడు, నూనె: సరిపడా, ఉప్పు: తగినంత.

తయారుచేసే విధానం:
* ఉల్లిపాయను పేస్టులా చేయకుండా చాలా సన్నగా తరగాలి.
* వెడల్పాటి గిన్నెలో చికెన్‌ ముక్కలు వేసి నూనె తప్ప మిగిలిన దినుసులన్నీ వేసి బాగా కలిపి అరగంటసేపు నాననివ్వాలి.
* బాణలిలో నూనె వేసి కాగాక చికెన్‌ ముక్కల్ని కొంచెంకొంచెంగా వేసి వేయించి తీయాలి. చివరగా పచ్చిమిర్చి, ఉల్లిముక్కలు, టొమాటో ముక్కలతో అలంకరించి అందించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.