కూరగాయలతో ప‌చ్చ‌డి – Vegetables pickle

కావల్సినవి:

క్యారెట్‌, క్యాప్సికం, ఉల్లిపాయ – ఒక్కోటి చొప్పున, క్యాబేజీ తరుగు – రెండు పెద్ద చెంచాలు, పచ్చిమిర్చి – ఐదు, వెల్లుల్లి తరుగు – పెద్ద చెంచా, ఆవనూనె – పావుకప్పు, ఉప్పు- తగినంత, ఆవపిండి – రెండు చెంచాలు, ఎండుమిర్చి – మూడు, నిమ్మకాయ – ఒకటి, ఆవాలు – చెంచా.

తయారీ:

క్యారెట్‌, క్యాప్సికం, ఉల్లిపాయని సన్నగా తరిగి ఈ ముక్కలకు క్యాబేజీ కూడా కలపాలి. వీటిపై ఆవపిండీ, తగినంత ఉప్పూ వేసి మరోసారి కలపాలి. తరవాత నిలువుగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి ఆవాలూ, ఎండుమిర్చీ, వెల్లుల్లి ముక్కలు వేయించి.. ఈ కూరముక్కలపై వేయాలి. చివరగా నిమ్మరసం కలిపితే చాలు. ఇందులో పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి కారం అవసరంలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.