కాకర వూర‌గాయ‌ -Kakarakaya pickle

కావల్సినవి: 

సన్నగా తరిగిన కాకరకాయ ముక్కలు – కప్పు,ఉప్పు, కాకర – రెండు పెద్ద చెంచాల చొప్పున, మెంతిపిండి – అరచెంచా, ఆవపిండి – అరచెంచా, పసుపు – చిటికెడు, నూనె – తగినంత, పంచదార – చిటికెడు, నిమ్మకాయ – ఒకటి (రసం తీసుకోవాలి), నూనె – కప్పు, ఇంగువ – పావుచెంచా.

తయారీ: 

బాణలిలో అరకప్పు నూనె వేడిచేసి కాకరకాయముక్కల్ని ఎర్రగా వేయించుకోవాలి. మరో గిన్నెలో నిమ్మరసం తప్ప మిగిలిన పదార్థాలన్నీ ఒక్కోటీ వేసుకుని బాగా కలపాలి. ఆ తరవాత వేయించిపెట్టుకున్న కాకర ముక్కల్ని కూడా కలిపి పైన నిమ్మరసం పిండాలి.. మిగిలిన నూనెలో ఇంగువ వేసి వేడిచేసి పచ్చడిపైన వేస్తే సరిపోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.