టొమాటో ఉల్లిపాయ చట్నీ

కావలసినవి:
పల్లీ నూనె – రెండు టేబుల్‌ స్పూన్లు, ఆవాలు – కొన్ని, మినపప్పు – రెండు టేబుల్‌ స్పూన్లు, ఎండుమిర్చి – నాలుగు, కరివేపాకులు – కొన్ని, ఉల్లిపాయలు (మీడియం సైజ్‌) – మూడు, టొమాటోలు (మీడియం సైజ్‌) – నాలుగు (కచ్చాపచ్చాగా తరిగి), ఉప్పు – ఒక టీస్పూన్‌, చింతపండు – పదిగ్రాములు లేదా ఒక రూపాయి నాణెం సైజులో, బెల్లం – ఒక టీస్పూన్‌.
తయారీవిధానం:
పాన్‌లో నూనె వేడిచేసి ఆవాలు వేయాలి. అవి చిటపటమంటున్నప్పుడు మినపప్పు, ఎండుమిర్చి వేసి వేగించాలి.
తరువాత కచ్చాపచ్చాగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకులు వేసి.. ఉల్లిముక్కలు బంగారు రంగుకి వచ్చే వరకు వేగించాలి.
తరువాత టొమాటోలు, ఉప్పు వేసి ఓ మాదిరి మంట మీద ఐదు నిమిషాలు వేగించాలి లేదా టొమాటోలు మెత్తబడేవరకు ఉంచాలి. స్టవ్‌ ఆపేసి చింతపండు, బెల్లం వేయాలి.
ఈ మిశ్రమాన్ని పాన్‌లో నుండి బయటకు తీసి చల్లారనివ్వాలి. తరువాత మిక్సీ జార్‌లో వేసి మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్‌ చేయాలి. రుబ్బేటప్పుడు నీళ్లు కలపొద్దు.
ఇడ్లీ లేదా దోసెల్లో తింటే యమ్మీగా ఉంటుంది. ఫ్రిజ్‌లో ఉంచితే ఈ చట్నీ రెండు రోజుల పాటు ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.