ఫ్రూట్‌ క్రీం- Fruit cream

కావల్సినవి:

చిక్కని పెరుగు – కప్పు, క్రీం – పావుకప్పు, యాలకులపొడి – అరచెంచా, చక్కెర – రెండు టేబుల్‌స్పూన్లు, పిస్తా, బాదం పలుకులు – అరకప్పు, యాపిల్‌, అరటిపండు ముక్కలు – రెండూ కలిపి అరకప్పు, దానిమ్మగింజలు – పావుకప్పు, పాలు – టేబుల్‌స్పూను.

తయారీ:

క్రీంని ఓ గిన్నెలోకి తీసుకుని గిలకొట్టాలి. అందులో చక్కెరా, పెరుగూ వేసి మరోసారి కలపాలి. ఇప్పుడు పాలూ, యాలకులపొడీ, పండ్ల ముక్కలూ, బాదం, పిస్తా పలుకులు కలపాలి. గంటసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి.. వడ్డించేముందు దానిమ్మ గింజలు వేస్తే చాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.