మరమరాలు ఉప్పు -puffed rice

కావలసిన పదార్ధాలు :
మరమరాలు – 1 శేరు
పచ్చిమిర్చి – 5
అల్లం -1 ముక్క
పచ్చి సెనగపప్పు -1 స్పూన్
ఆవాలు -1/2
ఉప్పు -సరిపడా
నూనె – 100 గ్రా
మినప్పప్పు -1/2 గరిట
కరివేపాకు -4 రెబ్బలు.
తయారు చేసే విధానం :
  • మరమరాలు నీళ్ళలో వేసి కలిపి గట్టిగా పిండి గిన్నెలో వేసుకోవాలి.అల్లం ,మిర్చి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.
  • బాండీలో నూనె వేసి కాగిన తరువాత శనగ పప్పు ,మినప్పప్పు ,ఆవాలు ,కరివేపాకు వేసి ,మిర్చి ,అల్లం ముక్కలు కూడా వేసి ఒక్క నిమిషం వేగనిచ్చి కాసిన నీళ్ళలో పోసి ఉప్పు వేయండి
  • ఇవి తెర్లేతప్పుడు నానబెట్టిన మరమరాలు,రవ్వంత పసుపు  వేసి కలియతిప్పుకోవాలి.ఇలాగే అటుకులతో కూడా ఉప్మా చేసుకోవచ్చు.కాకపోతే దీనికి కొంచెం నీళ్ళు ఎక్కువ పడతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.