వడాపావ్

కావలసినవి:
వడల కోసం: బ్రెడ్ పావ్‌లు: 10, సెనగపిండి: కప్పు, పసుపు: అరటీస్పూను, ఇంగువ: చిటికెడు, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు: కప్పు, అల్లం-పచ్చిమిర్చి ముద్ద: 2 టీస్పూన్లు, నిమ్మరసం: 2 టీస్పూన్లు, కొత్తిమీర తురుము: టేబుల్‌స్పూను, ఉప్పు: తగినంత, కరివేపాకు: 2 రెబ్బలు
తయారుచేసే విధానం:
ఉడికించిన బంగాళాదుంప ముక్కలన్నింటినీ మెత్తగా మెదపాలి. తరవాత అందులో వడకోసం తీసినవన్నీ వేసి కలపాలి. అందులో తగినన్ని నీళ్లు పోసి మరీ పలుచగా కాకుండా మెత్తని ముద్దలా చేసి చిన్న వడల్లా చేత్తోనే వత్తి, ఇడ్లీ రేకుల్లో పెట్టి ఆవిరిమీద ఉడికించి తీయాలి. పావ్ల్ని సగానికి కోసి వాటి మధ్యలో ఈ వడల్ని పెట్టి అందిస్తే వడాపావ్ రెడీ.