రొయ్యల వేపుడు – Prawns fry

కావలసినవి:

రొయ్యలు: 20 పెద్దవి, ఉప్పు: తగినంత, కారం: 2-3 టీస్పూన్లు, పసుపు: చిటికెడు, అల్లంవెల్లుల్లిముద్ద: అరటీస్పూను, మైదా: అరకప్పు, గుడ్లు: రెండు(గిలకొట్టి పెట్టాలి), బ్రెడ్‌పొడి: కప్పు, నూనె: 4 టేబుల్‌స్పూన్లు

తయారుచేసే విధానం:

రొయ్యలకి ఉప్పు, కారం, పసుపు, అల్లంవెల్లుల్లిముద్ద పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కో రొయ్యని ముందు మైదాలో పొర్లించి తరవాత గిలకొట్టిన గుడ్డులో ముంచాలి. తరవాత బ్రెడ్‌పొడిలో పొర్లించి ఓ ప్లేట్‌లో సర్దాలి. పాన్‌లో రెండు టేబుల్‌స్పూన్ల నూనె వేసి వేడెక్కిన వెంటనే కొన్ని రొయ్యలని ఒకదానికొకటి అంటుకోకుండా వేయాలి. తరవాత ఒకవైపు గోధుమరంగు వచ్చేదాకా రెండుమూడు నిమిషాలు వేయించాలి. రెండోవైపు కూడా అలాగే వేయించాలి. ఇలాగే మిగిలినవి కూడా వేయించి తీసి కెచప్‌తో అందించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.