తవా ప్రాన్స్ – Thai Prawns

కావల్సినవి:
పెద్ద రొయ్యలు – ఎనిమిది వందల గ్రా, అల్లంవెల్లుల్లి ముద్ద – టేబుల్‌స్పూను, క్యాప్సికం, ఉల్లిపాయ, టొమాటో – ఒక్కోటి చొప్పున, నూనె – పావుకప్పు, జీలకర్ర – ఒకటిన్నర చెంచా, కారం – చెంచా, జీలకర్ర పొడి – చెంచా, ధనియాలపొడి – అరచెంచా, నిమ్మకాయ – సగం చెక్క, కొత్తిమీర – కట్ట, ఉప్పు – తగినంత, పుదీనా – కట్ట, పసుపు – అరచెంచా, వెల్లుల్లి తరుగు – కొద్దిగా మెంతికూర – పావుకప్పు.
తయారుచేసే విధానం:
రొయ్యల్ని శుభ్రంగా కడిగి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. వాటిపై నిమ్మరసం, సగం అల్లంవెల్లుల్లి ముద్ద, తగినంత ఉప్పూ, సగం కారం, జీలకర్రపొడి, పసుపూ వేసి అన్నింటినీ కలిపి పెట్టుకోవాలి. పదిహేను నిమిషాలయ్యాక బాణలిలో కొద్దిగా నూనె వేడిచేసి రొయ్యల్ని వేయించి తీసుకోవాలి. అదే బాణలిలో మిగిలిన నూనె వేసి జీలకర్ర, వెల్లుల్లి తరుగూ, ఉల్లిపాయముక్కలు వేయించాలి. తరవాత మిగిలిన అల్లంవెల్లుల్లి ముద్దా, కారం, ధనియాలపొడి, టొమాటో ముక్కలు వేయాలి. టొమాటోలు మెత్తగా అయ్యాక వేయించి పెట్టుకున్న రొయ్యల్ని వేసి మంట తగ్గించాలి. ఐదు నిమిషాలయ్యాక క్యాప్సికం తరుగు, కొత్తిమీర తరుగూ, పుదీనా, మెంతిఆకులు వేయాలి. అన్నీ వేగాక.. దింపేముందు కొద్దిగా ఉప్పు చల్లితే సరిపోతుంది.