బీట్రూట్ పచ్చడి – beetroot pickle

కావల్సినవి:
బీట్రూట్- ఒకటి, ఉప్పు- తగినంత, కారం- అరకప్పు, ఆవపిండి- పావుకప్పు, నిమ్మరసం- ఆరుచెంచాలు, పసుపూ, నూనె- కప్పు, ఆవాలు- అరచెంచా, ఎండుమిర్చి- రెండు.
తయారీ:
బీట్రూట్ని చిన్నముక్కలుగా తరిగి అందులో నిమ్మరసం కలిపి పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి ఆవాలూ, ఎండుమిర్చీ వేయించి పొయ్యి కట్టేయాలి. అందులోనే తగినంత ఉప్పూ, కారం, ఆవపిండీ వేసి నిమిషం అయ్యాక ఈ తాలింపునంతా బీట్రూట్ ముక్కలకు కలిపితే చాలు.