మటన్ కబాబ్ – Mutton kabab

కావలసిన పదార్థాలు:
కీమా మటన్ – అరకేజి, ఉల్లిపాయ -1, అల్లం వెల్లుల్లి పేస్టు – 2 స్పూన్లు, పచ్చిమిర్చి – 3, కొత్తిమీర తరుగు – 3 టేబుల్ స్పూన్లు, పచ్చిబొప్పాయి పేస్టు – 3 టేబుల్ స్పూన్లు, కారం – 1 టీ స్పూను, యాలకులు – 8, మిరియాలపొడి – 1 టీ స్పూను, గరం మసాల – 1 టీ స్పూను, ఉప్పు – రుచికి తగినంత, నూనె – సరిపడా, నిమ్మరసం – అర చెక్క, చాట్ మసాల – 1 టీ స్పూను.
తయారుచేసే విధానం:
కీమాను శుభ్రంగా కడిగి నీరు లేకుండా పిండేయాలి. ఒక పాత్రలో కీమాతో పాటు మిగతా పదార్థాలన్నీ వేసి ముద్దలా కలిపి, ఒక ప్లాస్టిక్ కవర్ కప్పి గంటసేపు రిఫ్రిజిరేటర్లో ఉంచాలి. ఈ లోపుగా వెదురు పుల్లల్ని నీటిలో నానబెట్టుకోవాలి. గుప్పిటనిండా కీమా మిశ్రమాన్ని తీసుకొని (8 అంగుళాల పొడవు, అంగుళం చుట్టుకొలతతో) పుల్లకు పట్టించాలి. అవసరమనుకుంటే నూనె పూసి బొగ్గులపై తిప్పుతూ దోరగా కాల్చుకోవాలి. వేడివేడిగా పుదీనా చట్నీతో తింటే చాలా బాగుంటాయి.