ఉగాది పచ్చడి తయారీ విధానం

ఉగాది, తెలుగువారు జరుపుకునే పండుగలలో ముఖ్యమయినది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఉదయాన లేచి తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు.”ఉగాది” అన్న తెలుగు మాట “యుగాది” అన్న సంస్కృతపద వికృతి రూపం.

తయారుచేయాలో తెలుసుకుందాం!
ఉగాది పచ్చడికి కావల్సిన పదార్థాలు:
వేపపువ్వు- తగినంత
చిన్న చెరుకు ముక్క – 1
చిన్న కొబ్బరి ముక్క -1
అరటిపళ్లు- 2
చింతపండు – తగినంత
చిన్న మామిడికాయ- 1
బెల్లం- 100 గ్రాములు
పచ్చి మిరపకాయ – 1
ఉప్పు- తగినంత
నీళ్లు – సరిపడా
తయారీ విధానం:
ముందుగా చెరుకు, కొబ్బరి, బెల్లం, మిర్చి, మామిడికాయను చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేసుకొని పెట్టుకోవాలి. వేప పువ్వును శుభ్రంగా కడిగి రేకుల్నితీసి పెట్టుకోవాలి. తగినన్నినీళ్లలో చింతపండును బాగా కలిపి వడకట్టిన పులుపు నీళ్లను చిన్న కొత్త కుండలోకి పోయాలి. అందులో బెల్లం తురుము వేసి బాగా కలపాలి. ఆ తర్వాత చిటికెడు ఉప్పు, చెరకు, కొబ్బరి, మిర్చి, మామిడికాయ ముక్కలు వేసి బాగా కలపాలి. చివరగా అరటిపండు ముక్కలు వేయాలి. అంతే షడ్రుచుల ఉగాది పచ్చడి రెడీ.
—రళ్ళబండీ బ్రహ్మచరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.