బీట్‌రూట్‌ రైస్‌ -Betroot rice

కావలసినవి
బీట్‌రూట్‌ – ఒకటిన్నర కప్పు (సన్నగా తరిగి), అన్నం- రెండు కప్పులు, పచ్చిమిర్చి – రెండు, ధనియాల పొడి, జీలకర్ర – ఒక్కో టీస్పూన్‌ చొప్పున, పచ్చి బఠాణీలు – ఒక కప్పు, కొత్తిమీర – ఒక కట్ట, నెయ్యి – ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు – రుచికి తగినంత.
 

తయారీ విధానం
తరిగిన బీట్‌రూట్‌ను ఉడికించాలి. తరువాత ఉడికించిన నీళ్లని ఒకపాత్రలోకి వంపి పక్కన పెట్టాలి.
పాన్‌లో కొంచెం నెయ్యి వేసి వేడిచేశాక జీలకర్ర వేయాలి. తరువాత పచ్చిమిర్చిని సన్నగా తరిగి దాన్ని కూడా వేసి వేగించాలి. ఆ తరువాత ఉడికించి, వడకట్టిన బీట్‌రూట్‌ని వేసి గరిటెతో కలపాలి.
ధనియాల పొడి, పచ్చి బఠాణీలు వేసి, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలపాలి. తరువాత ఉప్పు వేయాలి.
ఈ మిశ్రమంలో అన్నం, బీట్‌రూట్‌ నీళ్లు పోసి కలపాలి. కాసేపయ్యాక స్టవ్‌ ఆపేసి పైనుంచి కొంచెం నెయ్యి వేసి వేడివేడిగా తింటే రుచిగా ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.