సేమియా షీర్ – Sheer

కావలసినవి:
వెన్న – రెండు టేబుల్‌స్పూన్లు సేమియా (వెర్మిసెల్లి) – పావు కప్పు, పంచదార – అరకప్పు, పాలు – మూడు కప్పులు, డ్రైఫ్రూట్ ముక్కలు – కొన్ని, కిస్మిస్, కర్జూరాలు – ఒక్కోటి రెండు టేబుల్ స్పూన్ల చొప్పున, సార పప్పు – ఒక టీస్పూన, యాలక్కాయ పొడి – అర టీస్పూన, రోజ్ వాటర్ – రెండు టేబుల్ స్పూన్లు.
తయారీ:
లోతైన గిన్నెలో వెన్న వేడిచేసి వెర్మిసెల్లిని బంగారు రంగు వచ్చేవరకు వేగించాలి.తరువాత పంచదార, పాలు పోసి పంచదార కరిగే వరకు వేడిచేయాలి.
తరువాత డ్రైఫ్రూట్స్ ముక్కలు, కిస్మిస్ వేసి బాగా కలిపి సన్నని సెగ మీద మూడు నుంచి నాలుగు నిమిషాలు ఉడికించాలి. ఆ తరువాత తాజా కర్జూరా ముక్కలు, సార పప్పు, యాలక్కాయ పొడి, రోజ్‌వాటర్ కలిపి సన్నని మంటమీదే మరో రెండు నిమిషాలు ఉంచాలి. షీర్ చిక్కగా అనిపిస్తే కొన్ని వేడినీళ్లు కలపాలి. స్టవ్ మీద నుంచి దించి వెంటనే వేడిగా తినేయొచ్చు. లేదా చల్లారాక తిన్నా బాగానే ఉంటుంది. తినేటప్పుడు యాలక్కాయ పొడి కొద్దిగా చల్లుకుంటే బాగుంటుంది.