క్యాబేజి సలాడ్ – Cabbage salad

కావల్సినవి:
సన్నగా తరిగిన క్యాబేజీ ముక్కలు – రెండు కప్పులు,పెసరపప్పు – పావుకప్పు కన్నా కొద్దిగా తక్కువ (రెండు మూడు గంటల ముందు నానబెట్టుకోవాలి), కరివేపాకు – రెండు రెబ్బలు, ఇంగువ -చిటికెడు, పచ్చిమిర్చి – ఒకటి, కొత్తిమీర తరుగు – పావుకప్పు, కొబ్బరితురుము – పావుకప్పు కన్నా కొద్దిగా తక్కువ, చక్కెర – అరచెంచా, నిమ్మరసం – రెండు చెంచాలు, ఉప్పు – తగినంత, నూనె – చెంచా.
తయారీ:
నానిన పెసరపప్పులో నీళ్లు వంపేసి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేడిచేసి కరివేపాకు, ఇంగువ, పచ్చిమిర్చి ముక్కల్ని వేయించాలి. అందులో క్యాబేజీ, పెసరపప్పు, తగినంత ఉప్పు వేయాలి. రెండు మూడు నిమిషాలు వేయించి పెసరపప్పు కొద్దిగా వేగాక దింపేయాలి. అది చల్లారాక కొత్తిమీర తరుగు, కొబ్బరితురుము, చక్కెర వేసి బాగా కలపాలి. చివరగా నిమ్మరసం కలిపితే నోరూరించే సలాడ్ తయార్.