కర్డ్ పాస్తా సలాడ్ -Curd Pasta Salad

కావల్సినవి:
పాస్తా – కప్పు, చిక్కని తాజా పెరుగు – కప్పు, సన్నని క్యాబేజీ తరుగు – పావుకప్పు,
క్యారెట్ తురుము – పావుకప్పు, ఉడికించిన బఠాణీ – కొద్దిగా, కొత్తిమీర తరుగు – రెండు టేబుల్స్పూన్లు, ఉప్పు – తగినంత, మిరియాలపొడి – కొద్దిగా, పచ్చిమిర్చి – రెండు.
తయారీ:
పాస్తాలో సరిపడా నీళ్లూ, కొద్దిగా ఉప్పూ వేసుకుని ఉడికించుకుని నీటిని వంపేయాలి. పెరుగును ఓసారి గిలకొట్టి అందులో క్యాబేజీ తరుగూ, పచ్చిమిర్చి ముక్కలూ, క్యారెట్ తురుమూ, ఉడికించిన బఠాణీ, తగినంత ఉప్పూ, మిరియాలపొడీ వేసి బాగా కలపాలి. చివరగా ఇందులో ఉడికించి పెట్టుకున్న పాస్తా కూడా వేసి మరోసారి కలిపి కొత్తిమీర తరుగు అలంకరిస్తే సరిపోతుంది.