కోడిగుడ్డు మటన్ ఖీమా
కావలసిన పదార్థాలు :
కోడిగుడ్లు -3, మటన్ ఖీమా – 150 గ్రా.లు, శనగపిండి – 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి తరుగు- టేబుల్ స్పూన్, ఎండుకారం – టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్- టీస్పూన్, ఉప్పు- రుచికి తగినంత, ధనియాలపొడి – అర టీ స్పూన్, గరం మసాలా -చిటికెడు, నిమ్మరసం – టీ స్పూన్, కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూన్, నూనె – వేయించడానికి తగినంత
తయారు చేసే విధానం:
ఒక పాత్రలో మటన్ ఖీమా, పచ్చిమిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్,నియాలపొడి,ఎండుకారం, శనగపిండి, గరంమసాలా, నిమ్మరసం, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి. ఉడికించిన గుడ్డును అందులో వేసి మిశ్రమంతో బాగా పట్టేలా కలపాలి. స్టౌ పై బాణలి పెట్టి నూనె కాగనివ్వాలి. తర్వాత ఆ గుడ్డును తీసి నూనెలో వేసి ఖీమా మిశ్రమం గోధుమరంగులోకి మారేంత వరకు అటూ ఇటూ తిప్పి వేయించాలి. ఆ తర్వాత గుడ్డును గుండ్రని ముక్కలుగా కట్చేసి ప్లేట్లో సర్ది వేడి వేడిగా టేస్ట్ చేయాలి.