చిలగడదుంప కూర

కావలసినవి :
చిలగడదుంపలు: అరకిలో, టొమాటో: మూడు, పచ్చిమిర్చి: రెండు, పెరుగు: అరకప్పు, కొత్తిమీర తురుము: 3 టేబుల్‌స్పూన్లు, నూనె: 3 టేబుల్‌స్పూన్లు, జీలకర్ర: అరటీస్పూను, ఇంగువ: చిటికెడు, పసుపు: పావు టీస్పూను, దనియాలపొడి: టీస్పూను, కారం: పావుటీస్పూను, గరంమసాలా: పావుటీస్పూను, ఉప్పు: తగినంత, అల్లంవెల్లుల్లి: టీస్పూను
తయారుచేసే విధానం :
1) టొమాటోలు, పచ్చిమిర్చి ముక్కలుగా కోసి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి.
2) పెరుగుని బాగా గిలకొట్టాలి.
3) చిలగడదుంపలు బాగా కడిగి పొట్టు తీసి ముక్కలుగా కోసి ఉప్పువేసిన నీళ్లలో వేసి ఉంచాలి.
4)ప్రెషర్‌ పాన్‌లో నూనె వేసి కాగాక జీలకర్ర వేసి వేయించాలి. తరవాత ఇంగువ, పసుపు, దనియాల పొడి వేసి వేగనివ్వాలి. ఇప్పుడు టొమాటో-మిర్చి ముద్ద, కారం వేసి కలిపి నూనె తేలేవరకూ వేయించాలి. తరవాత చిలగడదుంప ముక్కలు వేసి రెండు నిమిషాలు వేగాక సుమారు ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి రెండు నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు బాగా గిలకొట్టిన పెరుగు కూడా వేసి మరిగించాలి.
5) తరవాత ఉప్పు వేసి మూతపెట్టి ఓ విజిల్‌ రానివ్వాలి. ఆవిరిపోయాక మూతతీసి సిమ్‌లో నాలుగు నిమిషాలు ఉడికించాలి. తరవాత గరంమసాలా, కొత్తిమీర తురుము వేసి కలిపి ఓ నిమిషం ఉంచి దించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.